రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది: ఐవైఆర్
- ఈ నెల పెన్షన్లు వారం రోజులు ఆలస్యం
- ఒకరోజు అటూ ఇటూ అయితే పర్లేదన్న ఐవైఆర్
- పొంతనలేని వ్యయంతో ముందుకెళితే కష్టమేనని వ్యాఖ్యలు
ఈ నెల పెన్షన్ ఒక వారం రోజుల తర్వాత ఈరోజు వచ్చిందని మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. గత నెలలో కూడా ఆలస్యంగానే వచ్చినా, ఈసారి ఆ ఆలస్యం మరింత అధికమైందని తెలిపారు. "జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు ఇతరత్రా ఖర్చులు బడ్జెట్ కేటాయింపుల్లో మొదట ఉంటాయి కాబట్టి ఒకరోజు అటూ ఇటూగా చెల్లించాల్సి ఉంటుంది... అలాంటిది, పెన్షన్ చెల్లింపులు ఒక వారం రోజులు వాయిదా పడ్డాయి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఆదాయానికి పొంతనలేని వ్యయంతో ముందుకుపోయే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ఇలాంటి భంగపాటు తప్పదని ఐవైఆర్ విమర్శించారు. ఒక నాలుగు రోజులు ముందో, వెనుకో ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయని స్పష్టం చేశారు.