సోకుల కోసం సచివాలయానికి వందల కోట్లా?: టీఆర్ఎస్ సర్కారుపై రేవంత్ రెడ్డి ధ్వజం

  • కరోనా కథలంటూ రేవంత్ ట్వీట్
  • వినాశకాలే విపరీతి బుద్ధి అంటూ వ్యాఖ్యలు
  • పేదల కోసం నిధులు ఖర్చుపెట్టలేదని విమర్శలు
టీఆర్ఎస్ సర్కారును అడుగడుగునా విమర్శించే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. కరోనా కథలు అంటూ ట్వీట్ చేశారు. వినాశకాలే విపరీత బుద్ధి... రాష్ట్రంలో కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే పేదల కోసం నిధులు ఖర్చు చేయలేదు కానీ, సోకుల కోసం సచివాలయానికి వందల కోట్లా? అంటూ ప్రశ్నించారు. సెక్రటేరియట్ నిర్మాణానికి రూ.400 కోట్లు విడుదల అంటూ మీడియాలో వచ్చిన వార్త క్లిప్పింగ్ ను కూడా రేవంత్ రెడ్డి తన ట్వీట్ కు జోడించారు.

కాగా, సచివాలయ కూల్చివేతను పరిశీలించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద విచారణకు స్వీకరించింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ కానీ, సోమవారం కానీ విచారణ జరగొచ్చని భావిస్తున్నారు. సచివాలయం జి బ్లాక్ లో గుప్తనిధులపై ఆరోపణలు చేస్తున్న రేవంత్, సచివాలయం కూల్చివేత సందర్భంగా అసలేం జరుగుతోందో తమకు పరిశీలించే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు.


More Telugu News