ప్రకాశం జిల్లాలో కలకలం.. పత్తా లేని 150 మంది కరోనా పేషెంట్లు

  • తప్పుడు చిరునామాలతో కరోనా పరీక్షలు
  • ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్న పేషెంట్లు
  • పోలీసులను ఆశ్రయించిన వైద్యాధికారులు
అసలే ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం, అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పరిస్థితి కంట్రోల్ లోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో, ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు జిల్లా అధికారులకు ముచ్చెమటలను పట్టిస్తున్నాయి. కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన దాదాపు 150 మందికి పైగా పేషెంట్లు పత్తా లేకుండా పోయారు. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ లలో బాధితులు లేకపోవడం, వారి సెల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ లో ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సీసీఎస్ పోలీసులతో దర్యాప్తు చేయిస్తున్నారు.

మొత్తం 300 మందికి పైగా జనాలు తమ అడ్రసులను తప్పుగా ఇచ్చారు. వీరిలో 150 మందికి పైగా వ్యక్తులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వీరంతా జనాలతో కలిసి తిరిగితే... కరోనా ఏ మేరకు విస్తరిస్తుందో ఊహించుకుంటేనే భయం కలుగుతోంది. దీంతో, వీరిని గుర్తించేందుకు సీసీఎస్ పోలీసులను అధికారులు ఆశ్రయించారు.


More Telugu News