కక్ష సాధింపులకు ఓ పరిధి, పరిమితి వుంటాయి: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

  • అచ్చెన్నాయుడు ఇంకా రిమాండ్‌లోనే ఉండటం బాధేస్తోంది
  • రూ.10 లక్షల అవినీతి కూడా చూపలేకపోయారు
  • కేసులతో వారిని వేధిస్తున్నారు
  • చివరకు ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు
మాజీ మంత్రి, తమ పార్టీ నేత అచ్చెన్నాయుడిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనబర్చుతోన్న తీరు పట్ల టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈఎస్‌ఐ కేసులో ఆయనను ఇప్పటికీ రిమాండ్ లోనే ఉంచడం పట్ల ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.  

'ఏ తప్పు చేయని అచ్చెన్నాయుడు ఇంకా రిమాండ్ లోనే ఉండటం బాధేస్తోంది. ఆ కుటుంబం దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉంది. మంత్రిగా అచ్చెన్న తీసుకున్న నిర్ణయాల్లో పట్టుమని 10 లక్షల రూపాయల అవినీతి కూడా చూపలేకపోయినప్పటికీ కేసులతో వేధిస్తున్నారు. కక్ష సాధింపులకు ఓ పరిధి, పరిమితి వుంటాయి. చివరకు ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు' అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా, ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌‌ను ఇటీవల హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌తో పాటు మిగిలినవారి బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది. మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అచ్చెన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.


More Telugu News