సుశాంత్ వ్యవహారంలో రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

  • సుశాంత్ కేసు సీబీఐకి బదిలీ
  • రియాతో పాటు ఆమె కుటుంబసభ్యులపైనా ఎఫ్ఐఆర్
  • బీహార్ పోలీసులతో సంప్రదింపులు కొనసాగిస్తామన్న సీబీఐ
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ విచారణ మొదలైంది. బీహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐ విచారణకు సిఫార్సు చేయగా, కేంద్రం గ్రీన్ సిగ్నల్ తో, సీబీఐ వెంటనే పని ప్రారంభించింది. ఈ కేసులో సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

బీహార్ పోలీసులు ఇంతక్రితం నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో రియా, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు షోయిక్ తో పాటు మరో ఇద్దరి పేర్లను చేర్చింది. నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకి ప్రేరేపించడం, అక్రమ నిర్బంధం, అక్రమ అధీనంలో ఉంచుకోవడం, తస్కరణ, నేరపూరిత విశ్వాస ఘాతుకం, మోసం, నేరపూరితంగా భయకంపితుడ్ని చేయడం వంటి ఆరోపణలు మోపారు. ఈ కేసును ఇకమీదట తామే దర్యాప్తు చేయనున్నా, బీహార్ పోలీసులతో సమాచార, సంప్రదింపులు ఉంటాయని సీబీఐ పేర్కొంది.


More Telugu News