భద్రతామండలిలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి మరోసారి భంగపడిన చైనా

  • కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించిన చైనా
  • అత్యధిక దేశాల నుంచి చైనా వాదనపై వ్యతిరేకత
  • ఇది పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమన్న భారత్
  • చైనాకు లభించిన మద్దతు స్వల్పమేనని వివరణ
తనకు దీటుగా ఎదుగుతోన్న భారత్ పై చైనా తన అక్కసు మరోసారి వెళ్లగక్కింది. భారత్ ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ తో కలిసి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న చైనా... కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో మరోసారి లేవనెత్తింది. అయితే ఎప్పట్లాగానే ఈ అంశాన్ని ప్రస్తావించి భంగపడింది. అత్యధిక సభ్యదేశాలు చైనా వాదనను వ్యతిరేకించాయి. మండలిలో చైనా వైఖరిపై భారత్ తీవ్రంగా స్పందించింది.భారత్ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాం అంటూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన చేసింది.

"భారత్ కు చెందిన జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన అంశాలను చైనా ఐరాస భద్రతామండలిలో ప్రస్తావించిందని మేం తెలుసుకున్నాం. ఇలాంటి విషయాలు పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారాలు అయినా చైనా జోక్యం చేసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. అయితే గతంలో వలే చైనాకు ఈసారి కూడా అంతర్జాతీయ సమాజం నుంచి ఈ విషయంలో కొద్దిపాటి మద్దతు మాత్రమే లభించింది" అని తన ప్రకటనలో పేర్కొంది.


More Telugu News