అమెరికా, పాకిస్థాన్ సహా పలు దేశాల్లో అయోధ్య భూమిపూజ ప్రత్యక్షప్రసారం.. పూర్తి వివరాలు!
- ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ లలో లైవ్ టెలికాస్ట్
- ముస్లిం దేశాలలో సైతం ప్రత్యక్షప్రసారం
- ఇండియాలో లైవ్ ఇచ్చిన దాదాపు 200 మీడియా సంస్థలు
అయోధ్య రామమందిర భూమిపూజ కార్యక్రమాన్ని మన దేశంలోని అశేష ప్రజానీకం వీక్షించిన సంగతి తెలిసిందే. మన దేశంలోనే కాకుండా ఈ కార్యక్రమాన్ని పలు దేశాల్లో ప్రత్యక్షప్రసారం చేశారు. ఈ చారిత్రాత్మత కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసిన దేశాల్లో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, కువైట్, పాకిస్థాన్, ఫిలిప్పైన్స్, శ్రీలంక, బాంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, ఒమన్, మలేషియా, ఇండొనేషియాలతో పాటు మరిన్ని దేశాలు ఉన్నాయి.
వివిధ దేశాల్లో ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించినట్టు సమాచారం. ఒక్క ఇండియాలోనే ఈ కార్యక్రమాన్ని 200 మీడియా సంస్థలు లైవ్ ప్రసారం చేశాయి. ఏఎన్ఐ ద్వారా దాదాపు 1200 స్టేషన్లకు ఫీడ్ ను పంపిణీ చేశారు. ఏపీటీఎన్ ద్వారా మరో 450 మీడియా సంస్థలకు పంపించారు. ఏసియా పసిఫిక్ దేశాలతో దూరదర్శన్ ఈ కార్యక్రమాన్ని పంచుకుంది.