వైసీపీలో గంటా ప్రకంపనలు.. మాకొద్దంటూ ఫ్లెక్సీలు, నిరసనలు!
- వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న గంటా
- గంటాను వ్యతిరేకిస్తున్న మంత్రి అవంతి తదితరులు
- గంటాను చేర్చుకోవద్దని జగన్ కు విన్నపం
టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. ఆయన చేరికకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలపడం, పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు కావడం కూడా జరిగిపోయాయి. మరోవైపు గంటా రానుండటంతో విశాఖ వైసీపీలో ముసలం పుట్టింది. గంటా రాకను స్థానిక వైసీపీ ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే మంత్రి అవంతి శ్రీనివాస్ గంటాపై బహిరంగ విమర్శలు చేశారు.
మరోవైపు, భీమిలి నియోజక వర్గంలో గంటాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. గంటా మాకొద్దు అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో వైయస్సార్ విగ్రహాన్ని గంటా తొలగించారని... ఇప్పుడు ఆయన పార్టీలోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. గంటాను పార్టీలోకి తీసుకోవద్దని జగన్ ను కోరుతున్నారు. మరోవైపు గంటా వైసీపీలో చేరితే... విశాఖ వైసీపీలో ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.