అయోధ్య రామ మందిర భూమి పూజపై పాక్‌ క్రికెటర్‌ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు

  • శ్రీరాముడి అందం ఆయన పేరులో కాదు
  • వ్యక్తిత్వంలో దాగి ఉంది
  • చెడుపై ఎల్లప్పుడూ మంచే గెలుస్తుంది
  • ఈ విషయాన్ని తెలపడానికి రాముడు ఓ ఉదాహరణ
అయోధ్యలో నిన్న జరిగిన రామ మందిర భూమి పూజపై పాకిస్థాన్‌ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్ కారణంగా ఆయన జీవితకాల నిషేధానికి గురైన విషయం తెలిసిందే. రామ మందిర భూమి పూజపై  ట్విట్టర్‌లో ఆయన స్పందిస్తూ.. శ్రీరాముడి అందం ఆయన పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగి ఉందని కనేరియా చెప్పాడు.

చెడుపై ఎల్లప్పుడూ మంచే గెలుస్తుందని తెలపడానికి రాముడు ఓ ఉదాహరణ అని అన్నాడు. అయోధ్యలో రామ మందిర భూమి పూజతో ప్రపంచంలోని హిందువులు అందరూ చాలా సంబరపడుతున్నారని ఆయన తెలిపాడు. ఆత్మ సంతృప్తికి ఈ భూమిపూజ ఓ గొప్ప కార్యమని చెప్పాడు.

మరోవైపు, మ్యాచ్‌ ఫిక్సింగ్ కారణంగా  జీవితకాల నిషేధానికి గురైన అంశంపై ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ... దాన్ని ఎత్తివేయాలని పాక్ క్రికెట్‌ బోర్డును కోరాడు. తాను ఒక హిందువు అయినందునే పీసీబీలో తనకు మద్దతు దొరకడం లేదని చెప్పాడు. కాగా, ఓ పాకిస్థాన్‌ ఆటగాడి మూడేళ్ల నిషేధాన్ని పీసీబీ ఇటీవల సగానికి తగ్గించిందనీ, తనపై మాత్రం పీసీబీ కఠినంగా వ్యవహరిస్తోందని  డానిష్‌ కనేరియా తెలిపాడు.


More Telugu News