ఎగువన భారీ వర్షాలు... కృష్ణా నదిపై రిజర్వాయర్లను ఖాళీ చేయాలని ఆదేశాలు!

  • నదిలోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం
  • రెండు మూడు రోజుల్లో శ్రీశైలానికి నీరు
  • ఆల్మట్టి, నారాయణపూర్ లో ఖాళీ పెంచాలన్న కేంద్ర జల సంఘం
కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయని, నదిలోకి భారీ వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం హెచ్చరించింది. ఈ కారణంతో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో కొంత నీటిని దిగువకు వదిలేసి, ఖాళీ ఉంచుకోవాలని సూచించింది. తూర్పు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని, దీంతో పలు పిల్ల కాలువలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని, ఆ నీరంతా నదిలోకి వస్తోందని వెల్లడించింది. నేడు, రేపు భారీ నీరు రానుందని జలసంఘం అధికారులు అంచనా వేశారు. కాగా, మరో రెండు మూడు రోజుల్లో శ్రీశైలం జలాశయం 75 శాతం వరకూ నిండిపోయేంత వరద రావచ్చని తెలియజేశారు.


More Telugu News