సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- నితిన్ సినిమాలో నయనతార?
- హాట్ టాపిక్ గా త్రివిక్రమ్ పారితోషికం!
- వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ఖరారు
- చిన్న సినిమాకు డీసెంట్ రేటు
* హిందీలో వచ్చిన 'అంధాధున్' చిత్రాన్ని నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర వుంది. హిందీలో టబు పోషించిన ఈ పాత్రకు పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు. ఈ క్రమంలో ఈ పాత్రకు ప్రస్తుతం నయనతారను ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
* ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం దర్శకుడు త్రివిక్రమ్ 20 కోట్ల భారీ పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
* చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదాపడింది. ఇదిలావుంచితే, వైష్ణవ్ తేజ్ నటించే రెండో సినిమా కూడా ఖరారైంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్నట్టు సమాచారం.
* సత్యదేవ్ హీరోగా వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రం ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ రిలీజ్ కాగా, చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక ఈ చిత్రం శాటిలైట్ హక్కులను తాజాగా ఈటీవీ 2.5 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.