మసీదు శంకుస్థాపనకు వెళ్తారా? అనే ప్రశ్నకు యోగి ఆదిత్యనాథ్ సమాధానం ఇదే!

  • మసీదు శంకుస్థాపనకు నన్ను ఎవరూ పిలవరు
  • పిలవనప్పుడు నేను వెళ్లను
  • నా పనిని ఒక ధర్మంగా భావిస్తాను
కోట్లాది మంది హిందువుల కలలను సాకారం చేస్తూ అయోధ్య రామాలయానికి ఈరోజు భూమిపూజ జరిగింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. మరోవైపు అయోధ్యలో జరగబోయే మసీదు శంకుస్థాపనకు వెళ్తారా? అని ఈ సందర్భంగా మీడియా ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు యోగి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మసీదు శంకుస్థాపనకు తనను ఎవరూ పిలవరని యోగి అన్నారు. తనను పిలవనప్పుడు తాను వెళ్లనని చెప్పారు. తన పనిని ఒక కర్తవ్యంగా, ధర్మంగా భావిస్తానని తెలిపారు. అన్ని మతాల ప్రజలు శాంతిసామరస్యాలతో కలిసి, మెలిసి బతకాలని తాను కోరుకుంటానని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మసీదు నిర్మాణానికి భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. త్వరలోనే మసీదు నిర్మాణ కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.


More Telugu News