భారత్ బయోటెక్ తో పాటు జైడస్ కాడిలా వ్యాక్సిన్ కూడా రెండో దశకు: ఐసీఎంఆర్

భారత్ బయోటెక్ తో పాటు జైడస్ కాడిలా వ్యాక్సిన్ కూడా రెండో దశకు: ఐసీఎంఆర్
  • ఇండియాలో మూడు వ్యాక్సిన్ లపై ట్రయల్స్
  • మొత్తం 11 ప్రాంతాల్లో పరీక్షలు
  • వెల్లడించిన ఐసీఎంఆర్ డీజీ బలరామ్ భార్గవ
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తో పాటు జైడస్ కాడిలా లిమిటెడ్ తయారుచేసిన వ్యాక్సిన్ ల ట్రయల్స్ రెండో దశలోకి ప్రవేశించాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ వెల్లడించారు.

"ప్రస్తుతం ఇండియాలో మూడు వ్యాక్సిన్ ల క్లినికల్ ట్రయల్స్ ప్రయోగదశలో ఉన్నాయి. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా వ్యాక్సిన్ లు తొలి దశను పూర్తి చేసుకున్నాయి. మొత్తం 11 చోట్ల ప్రయోగాలు జరిగాయి. క్రియా రహిత వైరస్ వ్యాక్సిన్ రూపంలో భారత్ బయోటెక్, డీఎన్ఏ ఆధారితంగా జైడస్ కాడిలా వ్యాక్సిన్ ను తయారు చేశాయి. ప్రస్తుతం రెండో దశ ట్రయల్స్ అధ్యయనం జరుగుతోంది" అని ఆయన మీడియాకు తెలిపారు.

కాగా, రెండో దశలో వ్యాక్సిన్ సేఫ్టీ, శరీరంలో వ్యాధి నిరోధకశక్తిని ఏ మేరకు పెంచుతుందన్న అంశాలపై అధ్యయనం జరుగుతుందని ఇప్పటికే భారత్ బయోటెక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తొలి దశ ట్రయల్స్ ఫలితాల విశ్లేషణ జరుగకుండానే, రెండో దశ ప్రయోగాలకు అనుమతిని డీసీజీఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) మంజూరు చేయడం పట్ల వైద్య నిపుణులు విస్మయాన్ని వ్యక్తం చేశారు. గత నెల మూడో వారం నుంచి వ్యాక్సిన్ ట్రయల్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.


More Telugu News