తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ కానిస్టేబుళ్లపై దూకిన చిరుత
- అలిపిరి నుంచి కొండపైకి వస్తుండగా ఘటన
- బైక్ వేగం పెంచి తప్పించుకున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు
- ఆ మార్గంలో బైక్ లకు తాత్కాలికంగా అనుమతి నిలిపివేసిన టీటీడీ
ఇటీవల తిరుమల క్షేత్రంలోనూ, ఘాట్ రోడ్డులోనూ క్రూర మృగాల సంచారం అధికమైంది. లాక్ డౌన్ కారణంగా జనసంచారం తగ్గిపోవడంతో శేషాచల అడవుల నుంచి వస్తున్న జంతువులు తిరుమల రోడ్లపైనా, ఘాట్ రోడ్డులోనూ దర్శనమిస్తున్నాయి.
తాజాగా అలిపిరి నుంచి తిరుమల కొండపైకి వస్తున్న ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లపై ఓ చిరుత దాడికి యత్నించింది. వారిద్దరూ వెంటనే అప్రమత్తమై బైక్ స్పీడ్ పెంచడంతో బతికిపోయారు. తాము కొద్దిలో తప్పించుకున్నామని, బైక్ వేగం పెంచడంతో చిరుత పంజాకు తాము చిక్కలేదని ఆ ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత టీటీడీ విజిలెన్స్ అధికారులు పెట్రోలింగ్ వాహనాన్ని చిరుతపులి దాడిచేసిన ప్రాంతానికి పంపారు. అక్కడ తాత్కాలికంగా ద్విచక్ర వాహనాలకు అనుమతిని నిలిపివేశారు.