సివిల్స్ లో 110వ ర్యాంక్ సాధించిన సిద్ధిపేట కుర్రాడు... హరీశ్ రావు హర్షం

  • యూపీఎస్సీ సివిల్స్-2019 ఫలితాలు వెల్లడి
  • మొత్తం 829 మంది ఎంపిక
  • మెరుగైన ర్యాంకు సాధించిన మంద మకరంద్
ఇవాళ యూపీఎస్సీ సివిల్స్-2019 ఫలితాలు వెలువడ్డాయి. సిద్ధిపేటకు చెందిన మంద మకరంద్ ఆలిండియా స్థాయిలో 110వ ర్యాంక్ సాధించాడు. మొత్తం 829 మంది సివిల్ సర్వీసులకు ఎంపికవగా, మకరంద్ మెరుగైన ర్యాంక్ అందుకున్నాడు. దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన సిద్ధిపేట బిడ్డ మంద మకరంద్ కు హార్దిక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ఖ్యాతిని దేశ స్థాయిలో నిలిపాడంటూ మకరంద్ ను అభినందించారు. మకరంద్ స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా రావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామం. మకరంద్ తల్లిదండ్రులు నిర్మల, సురేశ్ నాలుగు దశాబ్దాల కిందట సిద్ధిపేటలో స్థిరపడ్డారు. వీరిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.


More Telugu News