ముంబై ఏమాత్రం సురక్షితం కాదు: మహారాష్ట్ర మాజీ సీఎం భార్య సంచలన వ్యాఖ్యలు
- సుశాంత్ కేసును విచారిస్తున్న ముంబై పోలీసుల తీరుపై విమర్శలు
- అమాయకులు, గౌరవప్రదంగా బతికేవారు ముంబైలో ఉండలేరని వ్యాఖ్య
- అమృతపై మండిపడుతున్న శివసేన, ఎన్సీపీ
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై మహానగరం మానవత్వాన్ని కోల్పోయిందని చెప్పారు. ముంబై ఏమాత్రం సురక్షితం కాదని అన్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును ముంబై పోలీసులు విచారిస్తున్న తీరును తప్పుపడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అమాయకులు, గౌరవప్రదంగా బతికే పౌరులకు ముంబై సురక్షిత ప్రదేశం కాదనే విషయం మన పోలీసుల తీరుతో తేలిపోయిందని ఆమె ట్వీట్ చేశారు.
మరోవైపు ఆమె ట్వీట్ పై శివసేన, ఎన్సీపీ నేతలు మండిపడుతున్నారు. తనకు రక్షణగా ఉన్న ముంబై పోలీసులనే ఆమె విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. శివసేన రాజ్యసభ సభ్యుడు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ... ఇలాంటి విమర్శలు చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలకు తాను ఒక సవాల్ విసురుతున్నానని... ముంబై పోలీసుల పరువు పోయేలా వ్యాఖ్యలు చేస్తున్న వారంతా పోలీసు సెక్యూరిటీని వదిలేయాలని అన్నారు. పోలీసు సెక్యూరిటీని వదిలేసి... ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకోవాలని ఛాలెంజ్ చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భార్య అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.