దమ్ముంటే చంద్రబాబు నాయుడి సవాలును స్వీకరించండి జగన్ గారు: దేవినేని ఉమ
- ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టారు
- ప్రజా రాజధాని అమరావతేనని జగన్ చెప్పారు
- 2 రాజధానులకు ప్రజామద్దతు ఉంటే అసెంబ్లీని రద్దు చేయండి
- ఎన్నికలకు వెళ్దామన్న సవాలును స్వీకరించాలి
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చి, ఎన్నికల తర్వాత మాట తప్పారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. మళ్లీ ఎన్నికలకు వెళ్దామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ విసిరిన విషయాన్ని గుర్తు చేస్తూ దాన్ని జగన్ స్వీకరించాలని దేవినేని డిమాండ్ చేశారు.
'ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి ప్రజా రాజధాని అమరావతేనని మీరు, మీ నాయకులు చెప్పి నమ్మకద్రోహం చేశారు. మీ మంత్రుల మాటలు కోటలుదాటుతున్నాయి. మీరంటున్న మూడు రాజధానులకు ప్రజామద్దతు ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామన్న చంద్రబాబు నాయుడి సవాలును స్వీకరించి, దమ్ముధైర్యం ఉంటే ప్రజాతీర్పు కోరండి వైఎస్ జగన్ గారూ' అని దేవినేని ఉమామహేశ్వరరావు ట్వీట్ చేశారు. అమరావతిపై గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆయన పోస్ట్ చేశారు.