చంద్రబాబు సవాల్ ఆశ్చర్యానికి గురి చేస్తోంది: గుడివాడ అమర్నాథ్
- అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామన్న చంద్రబాబు
- 48 గంటల్లో జగన్ స్పందించాలని సవాల్
- ముందు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్న అమర్నాథ్
అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అంతేకాదు, 48 గంటల్లో ఈ సవాల్ పై స్పందించాలని అన్నారు. గడువులోగా స్పందించకపోతే మళ్లీ మీడియా ముందుకు వస్తానని చెప్పారు.
ఇక చంద్రబాబు సవాల్ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే గుడివాడ అమర్ మాట్లాడుతూ, జగన్ కు చంద్రబాబు 48 గంటల సమయం ఇవ్వడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పారు. ఏడాదిన్నర క్రితం అమరావతి సహా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతిని చంద్రబాబు మర్చిపోయారా? అని ప్రశ్నించారు.
వైసీపీకి సవాల్ విసిరే ముందు టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రియలెస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. మూడు రాజధానులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని... అందుకే అధికార వికేంద్రీకరణకు ప్రజలంతా ఆమోదం తెలుపుతున్నారని చెప్పారు.