సున్నం రాజయ్య, వంగపండు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- రాజయ్య అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడు
- ప్రజల హృదయాల్లో నిలిచి పోతారు
- వంగపండు ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు పాడారు
- ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పాటుపడ్డారు
మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారని తెలంగాణ సీఎంవో పేర్కొంది.
'సున్నం రాజయ్య మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేసిన రాజయ్య అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని సీఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు' అని సీఎంవో ట్వీట్ చేసింది.
'ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు శ్రీ వంగపండు ప్రసాదరావు మృతి పట్ల సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు-సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు' అని సీఎంవో పేర్కొంది.