రూ. 75 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును కొన్న రొనాల్డో!
- ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 కార్లు మాత్రమే తయారీ
- రొనాల్డో గ్యారేజీలో రూ. 264 కోట్ల విలువైన కార్లు
- ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్న క్రిస్టియానో
పోర్చుగల్ జాతీయ ఫుట్‌బాలర్, జువెంటస్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బుగాట్టి లా వాచ్యూర్ ఎన్వైర్ కారును కొనుగోలు చేశాడు. తనకు తానే బహుమతిగా కొనుగోలు చేసిన ఈ కారు ఖరీదు దాదాపు రూ. 75 కోట్లు (8.5 మిలియన్ యూరోలు). ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి పది కార్లను మాత్రమే సంస్థ తయారు చేసింది. తాను కారు కొనుగోలు చేసిన విషయాన్ని ఈ స్టార్ ఆటగాడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 35 ఏళ్ల రొనాల్డో గ్యారేజీలో ప్రస్తుతం 30 మిలియన్ యూరోలు (రూ. 264 కోట్ల) విలువైన కార్లు ఉండడం గమనార్హం.