కరోనాకు అద్భుతమైన చికిత్స ఏదీ లేదు.. రాకపోవచ్చు కూడా: డబ్ల్యూహెచ్ఓ

  • వైరస్ అంతానికి సులభమైన పరిష్కారం దొరక్కపోవచ్చు
  • చైనాలో ప్రాథమిక విచారణ ముగిసింది
  • త్వరలోనే అంతర్జాతీయ బృందం వెళ్తుంది
కరోనా వైరస్‌ను అంతం చేసే అత్యంత సులభమైన అద్భుతమైన చికిత్స ఏదీ లేదని, బహుశా అది ఎప్పటికీ రాకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అభిప్రాయపడింది. టీకా అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ సులభమైన పరిష్కారం ఏదీ ఉండకపోవచ్చని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్ అన్నారు.

చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ అక్కడ మనుషుల్లోకి ఎలా ప్రవేశించిందనే విషయంపై విచారణ చేపట్టేందుకు డబ్ల్యూహెచ్ఓ పంపిన ఇద్దరు సభ్యుల బృందం ప్రాథమిక విచారణ ముగించినట్టు తెలిపారు. వైరస్‌కు సంబంధించిన మూలాలను కనుగొనేందుకు డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం చైనా పరిశోధకులతో కలిసి పనిచేస్తుందని టెడ్రోస్ వివరించారు.


More Telugu News