జిమ్ లు, యోగా సెంటర్లకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
- ఇటీవల సడలింపులు ఇచ్చిన కేంద్రం
- తాజాగా మార్గదర్శకాలు జారీ
- ఆరడుగుల దూరం పాటించాలని స్పష్టీకరణ
ఇటీవలే కేంద్రం లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా జిమ్ లు, యోగా కేంద్రాలకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 నుంచి జిమ్ లు, యోగా సెంటర్లు తెరుచుకోనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాటి నిర్వహణ ఎలా ఉండాలన్న దానిపై హోంశాఖ ఆదేశాలకు అనుగుణంగా కేంద్రం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
తాజా మార్గదర్శకాల ప్రకారం... జిమ్ లు, యోగా కేంద్రాల్లో ఆరడుగుల దూరం పాటిస్తూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. జిమ్ లు, యోగా కేంద్రాలకు వెళ్లేవారు సొంతంగా మ్యాట్ లు తీసుకెళ్లాలి. ఫోన్ లో ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలి. విధిగా ఫేస్ మాస్కు ధరించాలి. కాగా, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న జిమ్ లకు అనుమతి ఇవ్వలేదు. ఆయా జోన్లపై పునఃసమీక్ష అనంతరమే వాటిలో కార్యకలాపాలపై నిర్ణయం తీసుకోనున్నారు.