ఐపీఎల్ కు చైనా స్పాన్సర్... ఇప్పుడు తొలగించలేమన్న బీసీసీఐ!

  • సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో చైనాపై వ్యతిరేకత
  • చైనా సంస్థ వివోను తప్పించాలంటూ డిమాండ్లు
  • మరో రెండేళ్లు కాంట్రాక్టు ఉందన్న బీసీసీఐ
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ లీగ్ సంబరం ఐపీఎల్ మరికొన్నిరోజుల్లో యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. సెప్టెంబరు 19న మొదలై నవంబరు 10న ముగియనుంది. అయితే, ఇటీవల సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల అనంతరం దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక ఉద్యమం వేళ్లూనుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ కు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న వివో కూడా ఓ చైనా సంస్థ కనుక, ఆ సంస్థను స్పాన్సర్ షిప్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి.

వివో సంస్థతో ఐపీఎల్ కు మరో రెండేళ్లపాటు కాంట్రాక్టు ఉందని, ఇప్పుడు స్పాన్సర్ షిప్ నుంచి తొలగించలేమని అధికారులు స్పష్టం చేశారు. గతేడాది ఉన్న స్పాన్సర్లందరూ ఈ సీజన్ కు కూడా కొనసాగుతారని తన ఉద్దేశాలను బోర్డు తేటతెల్లం చేసింది. చైనా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం వివోతో ఐపీఎల్ కు ఐదేళ్ల కాంట్రాక్టు ఉంది. ఇందుకోసం వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఒప్పందం 2022లో ముగియనుంది.


More Telugu News