అమెరికా గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా స్వైర విహారం

  • అమెరికాలో అసాధారణ రీతిలో వైరస్ వ్యాప్తి
  • ఆందోళన వ్యక్తం చేసిన వైట్ హౌస్ నిపుణులు
  • గ్రామాల్లో కరోనా ముప్పు ఎక్కువని వెల్లడి
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిన్నమొన్నటివరకు నగరాలు, పట్టణాల్లో ప్రభావం చూపిన ఈ ప్రాణాంతక వైరస్ ప్రస్తుతం అమెరికా గ్రామీణ ప్రాంతాల్లోనూ విరుచుకుపడుతోంది. 14 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని, గ్రామాల్లోనూ కరోనా విజృంభించడం ఆందోళన కలిగిస్తోందని వైట్ హౌస్ నిపుణులు పేర్కొన్నారు.

ఇది కొత్త దశ అని, ఇప్పుడు నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా దేశం మొత్తం కరోనా వ్యాప్తిచెందుతోందని, ఇది అసాధారణ పరిణామం అని వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ సమన్వయకర్త డాక్టర్ డెబోరా బిర్క్స్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి వైరస్ ముప్పు ఎక్కువ అని, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడి చేసుకునే కార్యక్రమాలు కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం అని వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు నిలిపివేయకపోతే అమెరికాలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం అత్యంత కష్టమని అభిప్రాయపడ్డారు.


More Telugu News