గెజిట్ పై హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతు పరిరక్షణ సమితి

  • వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దుపై గెజిట్ విడుదల చేసిన ఏపీ సర్కారు 
  • అమలు నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్
  • పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లును ఇటీవలే గవర్నర్ ఆమోదించగా, ఆ వెంటనే ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీనిపై రాజధాని రైతు పరిరక్షణ సమితి స్పందించింది. మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గెజిట్ అమలు నిలిపివేయాలని, సీఎం కార్యాలయం, రాజ్ భవన్, సెక్రటేరియట్ ను ఇక్కడి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి కోర్టును కోరింది. కాగా, ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.


More Telugu News