బాధ్యతలు స్వీకరించాను.. ఏపీ సర్కారు సహకరిస్తుందని ఆశిస్తున్నా: విజయవాడలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
- విజయవాడలోని ఆఫీసులో బాధ్యతల నిర్వహణకు నిమ్మగడ్డ
- ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థ
- రాగద్వేషాలకు అతీతంగా ఈసీ వ్యవహరిస్తోంది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు ఆయన విజయవాడలోని కార్యాలయానికి బాధ్యతల నిర్వహణ కోసం వచ్చారు. హైకోర్టు, గవర్నర్ ఆదేశాల మేరకు ఇటీవలే ఆయనను ఏపీ సర్కారు మళ్లీ ఎస్ఈసీగా నియమించిన విషయం తెలిసిందే.
బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో విజయవాడలో నిమ్మగడ్డ రమేశ్ మాట్లాడుతూ.. గవర్నర్ నోటిఫికేషన్ మేరకు శుక్రవారమే తాను హైదరాబాద్ నుంచి బాధ్యతలు చేపట్టానని వ్యాఖ్యానించారు. బాధ్యతలు చేపట్టినట్లు కలెక్టర్లు, సంబంధిత అధికారులకు సమాచారమిచ్చానని తెలిపారు.
ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్ ద్వారా ఈ సమాచారాన్ని అందించినట్లు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివరించారు. బాధ్యతల నిర్వహణ కోసమే తాను ఈ రోజు విజయవాడలోని కార్యాలయానికి వచ్చానని చెప్పారు.
ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థని, రాగద్వేషాలకు అతీతంగా ఈసీ వ్యవహరిస్తోందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పారు. గతంలో మాదిరిగానే తన విధుల నిర్వహణలో ఏపీ సర్కారు సహకరిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.