సోనూ సూద్ ‘హీరో’ అవుతాడని ‘పూరి’కి ముందే ఎలా తెలిసిందబ్బా!
- వైరల్ అవుతున్న ‘ఏక్ నిరంజన్’ సినిమాలోని క్లిప్
- హీరోను తానేనంటూ సోను డైలాగ్
- సోనూ సూద్ ఎప్పుడూ హీరోనే అంటూ పూరి రిప్లై
అవును.. సోషల్ మీడియాలో ఇప్పుడిదే వైరల్ అవుతోంది. విలన్ వేషాలు వేసే సోనూ సూద్ ‘హీరో’ అవుతాడని దర్శకుడు పూరి జగన్నాథ్‌కు ముందు ఎలా తెలిసిందని ప్రశ్నిస్తూ ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా పూరి దర్శకత్వంలో వచ్చిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలోని క్లిప్ ఇది. ఇందులో కోపంగా ఉన్న సోనూ సూద్ బ్రహ్మానందం చెంపపై లాగిపెట్టి కొడుతూ.. ‘‘నువ్వు ఆ రోజు నన్ను విలన్ అన్నావు. కానీ విలన్ వాడు బ్రహ్మాజీ. నేను హీరోను’’ అని చెబుతాడు.
ఈ వీడియోను పోస్టు చేసిన నెటిజన్లు.. సోనూ సూద్ ఎప్పటికైనా జనంతో హీరో అనిపించుకుంటాడని మీరు ముందే ఊహించి ఈ డైలాగ్ రాసినట్టు ఉందని ప్రశంసించారు. దీనికి పూరి స్పందిస్తూ.. ‘‘నాకు తెలుసు.. సోనూ సూద్ ఎప్పుడూ హీరోనే’’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.