కరోనా రోగుల అంశంలో రాష్ట్రాలకు కీలక సూచన చేసిన కేంద్రం
- రోగులకు స్మార్ట్ ఫోన్లు వాడే వెసులుబాటు ఇవ్వాలని సూచన
- రోగులు స్వాంతన పొందుతారని వెల్లడి
- కరోనా పేషెంట్ల మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనని వెల్లడి
కరోనా లక్షణాలతో బాధపడుతూ పాజిటివ్ వచ్చి ఆసుపత్రిపాలైన రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. కరోనా రోగులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో మాట్లాడడం ద్వారా ఎంతో ఊరట పొందుతారని, వారికి ఆ సౌకర్యం కల్పించేందుకు వీలుగా కరోనా రోగులు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు ఉపయోగించేందుకు రాష్ట్రాలు అనుమతి ఇవ్వాలని కేంద్రం సూచించింది. రోగులు ఇతరులతో మాట్లాడడం వల్ల స్వాంతన పొందుతారని వివరించింది.
అయితే, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లను క్రిమిరహితం చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్ఎస్) అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. రోగుల మానసిక ఆరోగ్యం కూడా ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది.