విశాఖ క్రేన్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం

  • నిన్న హిందూస్థాన్ షిప్ యార్డులో ఘోరప్రమాదం
  • క్రేన్ కూలి 11 మంది మృతి
  • షిప్ యార్డు అధికారులతో చర్చించిన మంత్రి అవంతి
విశాఖపట్నం హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలి 11 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.

నిన్న జరిగిన ప్రమాదం నేపథ్యంలో మంత్రి అవంతి నష్టపరిహారం, ఇతర అంశాలపై హిందూస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్ యాజమాన్యం, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. అధికారులు, కార్మికులతోనూ ఆయన చర్చించారు. పర్మినెంటు ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు సంస్థల్లో శాశ్వత ఉపాధి కల్పించనున్నట్టు అవంతి వివరించారు. ఇవి కాకుండా హిందూస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్ ద్వారా అదనపు సౌకర్యాలు కలుగుతాయని తెలిపారు.


More Telugu News