ఇకపై భూసేకరణలు చేపడితే ఏం నమ్మి ప్రజలు భూములిస్తారు?: నాగబాబు

  • జనసేన నేతల టెలీకాన్ఫరెన్స్
  • హాజరైన నాదెండ్ల మనోహర్, నాగబాబు, తోట
  • జనసేన ఒకే విధానంతో ఉందన్న నాగబాబు
  • రాజధాని నిర్ణయం వ్యక్తిగత అజెండాతో తీసుకున్నారన్న నాదెండ్ల
ఏపీలో తాజా పరిణామాలపై జనసేన పార్టీ నాయకత్వం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు, తోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, రాజధాని అంశంపై వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంతో ఒప్పందం మేరకే రాజధాని రైతులు తమ భూములు ఇచ్చారని, ఇకపై భూసేకరణలు చేపడితే ఏం నమ్మి ప్రజలు భూములిస్తారని ప్రశ్నించారు. అయితే, ఏపీ రాజధాని అంశంలో జనసేన పార్టీ తొలి నుంచి ఒకే విధానం అవలంబిస్తోందని నాగబాబు స్పష్టం చేశారు.

నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాజధాని తరలింపు నిర్ణయం వ్యక్తిగత అజెండాతో తీసుకున్న నిర్ణయం అని విమర్శించారు. రాజధానిలో అవినీతి జరిగిందని చెబుతున్న వైసీపీ, విచారణ జరిపి స్కాంలకు పాల్పడిందెవరో వెలికితీసి వారిని శిక్షించాలి కదా! అని అన్నారు. ఏపీలో రాజధాని వికేంద్రీకరణపై న్యాయపోరాటానికి సమయం ఆసన్నమైందని జనసేన నేతలు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు.


More Telugu News