మరో రికార్డ్ సృష్టించిన అల్లు అర్జున్‌ 'బుట్టబొమ్మ' పాట

  • అలరించిన బన్నీ డ్యాన్స్‌
  • యూట్యూబ్‌లో 300 మిలియన్ల వ్యూస్
  • ఏ తెలుగు పాటకు ఇలాంటి స్పందన రాలేదన్న థమన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు సంగీత ప్రియుల నుంచి విశేష స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందు నుంచే ‘బుట్టబొమ్మ’ పాట అందరి దృష్టినీ ఆకర్షించింది. అనంతరం యూట్యూబ్‌లో పోస్ట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు లక్షలాది వ్యూస్‌ను సాధిస్తూ దూసుకుపోయింది.

ఇందులో అల్లు అర్జున్, పూజా హెగ్డే డ్యాన్స్, థమన్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేశాయి. తాజాగా ఈ పాట 300 మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది.  ఈ సందర్భంగా  థమన్ తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ విషయాన్ని తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఏ తెలుగు పాటకు ఇప్పటివరకు ఇలాంటి స్పందన రాలేదని ఆయన చెప్పారు.


More Telugu News