విశాఖలో భూములు లాక్కుంటున్నారు: దేవినేని ఉమ
- ఎన్నికల ముందు తాడేపల్లి రాజప్రసాదం కట్టి నమ్మించారు
- 34 వేల ఎకరాలిచ్చిన 29 వేల రైతు కుటుంబాలను ముంచారు
- ఖర్చుపెట్టిన 10 వేలకోట్ల రూపాయల సంగతేంటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. 'ఎన్నికల ముందు తాడేపల్లి రాజప్రసాదం కట్టి నమ్మించారు. ప్రజారాజధానికి పైసా ఖర్చులేకుండా 34 వేల ఎకరాలిచ్చిన 29 వేల రైతు కుటుంబాలను ముంచారు. ఖర్చుపెట్టిన 10 వేలకోట్ల రూపాయల సంగతేంటి? విశాఖలో భూములు లాక్కుంటున్నారు. రాజధాని మార్పుమీద ఎన్నికలకు వెళ్లి ప్రజలతీర్పు అడిగే ధైర్యంఉందా? వైఎస్ జగన్ గారు' అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఏపీలో పలు ప్రాంతాల్లో ప్రజలు నిరసనలు తెలిపిన వార్తలను ప్రచురించిన పత్రిక కథనాలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు. రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు కొనసాగాయని అందులో ఉంది.