లడఖ్ వద్ద సైన్యాన్ని ఉపసంహరించుకుని.. లిపులేక్ వద్ద మోహరిస్తున్న చైనా

  • వక్రబుద్ధిని మళ్లీ బయటపెట్టుకున్న చైనా
  • సైన్యాన్ని వెనక్కి తీసుకున్నట్టు ఇటీవలే ప్రకటించిన డ్రాగన్ కంట్రీ
  • అప్రమత్తమైన భారత్
ఇరు దేశాల మధ్య మరోమారు ఉద్రిక్తతలు పెంచేలా చైనా అడుగులు వేస్తోంది. లడఖ్ వద్ద సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన చైనా ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని లిపులేక్ పాస్ వద్ద భారీగా మోహరిస్తోంది. లిపులేక్ ప్రాంతాన్ని నేపాల్ ఇటీవల తమ భూభాగంగా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో నేపాల్‌కు దగ్గరైన చైనా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏకంగా సైన్యాన్నే మోహరిస్తోంది. సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించి రోజులు కూడా గడవకముందే మళ్లీ తన సహజ వక్రబుద్ధిని బయటపెట్టుకుంది.

లిపులేఖ్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఉత్తర ప్రాంతాల్లోని భారత సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తోంది. చైనా తీరుతో అప్రమత్తమైన భారత్ కూడా సరిహద్దుల వద్దకు సైన్యాన్ని తరలిస్తోంది. చైనా వెనక్కి తగ్గుతుందా? లేదా? అన్న దానితో సంబంధం లేకుండా తాము ఎప్పటికప్పుడు వివిధ ప్రాంతాలకు సైన్యాన్ని తరలిస్తున్నట్టు భారత సైన్యాధికారులు తెలిపారు. మరోవైపు, లడఖ్ నుంచి వెనక్కి తగ్గుతున్నట్టు చెప్పిన చైనా వాస్తవాధీన రేఖ వెంబడి శాశ్వత సైనిక స్థావరాలను నిర్మిస్తోంది.


More Telugu News