టిక్ టాక్ ను సొంతం చేసుకునే యత్నంలో మైక్రోసాఫ్ట్!

  • టిక్ టాక్ పై నిషేధం విధిస్తామన్న ట్రంప్
  • అమెరికా కంపెనీగా గుర్తిస్తే నిషేధించబోమని ప్రకటన
  • రంగంలోకి దిగిన ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్
చైనాకు చెందిన పలు యాప్ లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిపిందే. అమెరికా కూడా చైనా యాప్ లను నిషేధిస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ వీడియో యాప్ టిక్ టాక్ ను కూడా నిషేధిస్తామని ట్రంప్ ప్రకటించారు. టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ ను అమెరికా కంపెనీగా గుర్తించాలని... అలాగైతే టిక్ టాక్ పై నిషేధం విధించబోమని ఆయన ప్రకటించారు. దీంతో, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగింది. టిక్ టాక్ ను సొంతం చేసుకోవడానికి బైట్ డ్యాన్స్ తో చర్చలను ప్రారంభించింది. దీనికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ బిజినెస్ లు కథనాలను ప్రచురించాయి. అయితే, మైక్రోసాఫ్ట్ మాత్రం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.


More Telugu News