ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం.
- శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య (89)
- ఈ రోజు ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో కన్నుమూత
- సాయంత్రం బన్సీలాల్ పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు
టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89) ఈ రోజు ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. వయసు పైబడటంతో గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. కమ్ముల శేషయ్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖుల శేఖర్ కమ్ములను ఫోన్ ద్వారా పరామర్శించారు.