24 గంటల వ్యవధిలో రెండు హత్యలు.. మనస్తాపంతో ఎస్సై ఆత్మహత్య
- కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఘటన
- సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో మనస్తాపం
- ఎస్పీకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఉరివేసుకుని ఆత్మహత్య
తన పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రోజు వ్యవధిలో రెండు వరుస హత్యలు జరగడంతో మనస్తానికి గురైన ఓ ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని హసన్ జిల్లా చెన్నరాయనపట్టణం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 గంటల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయి. ఆ వెంటనే ఈ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కిరణ్ కుమార్ (34) నిన్న ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. వరుస హత్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు, ఉన్నతాధికారుల వేధింపుల వల్లేనని మరికొందరు ఆరోపిస్తున్నా.. కిరణ్ ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.
మరోవైపు, సోషల్ మీడియాలో ట్రోల్స్ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే హత్యలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులకు తోడు, హత్యల గురించి తెలిసి పోలీస్ స్టేషన్‌కు వస్తున్న ఎస్పీకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక ఎస్సై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.