భూమి పూజ సందర్భంగా ఆరెస్సెస్ చీఫ్ తో వేదిక పంచుకోనున్న ప్రధాని మోదీ
- ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిరం భూమి పూజ
- ఒకే వేదికపై మోదీ, మోహన్ భగవత్
- 3 గంటల పాటు అయోధ్యలో గడపనున్న మోదీ
ఆగస్టు 5న రామ మందిరం భూమి పూజ సందర్భంగా అయోధ్యలో అరుదైన దృశ్యం కనిపించనుంది. ఒకే వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసీనులు కానున్నారు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్టీకి సైద్ధాంతిక మూలస్తంభం ఆరెస్సెస్ అన్న సంగతి తెలిసిందే. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో రామ మందిరం భూమి పూజను కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసే వేదికపై ప్రధాని మోదీ, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, రామ మందిరం ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ లు మాత్రమే కూర్చుంటారు. భూమి పూజకు ముందు ప్రధాని మోదీ అక్కడి హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆయన దాదాపు 3 గంటల పాటు అయోధ్యలో ఉండనున్నారు.