రాహుల్ గాంధీ గారూ... నన్ను క్షమించండి.. నేను కీలుబొమ్మను కాను: ఖుష్బూ

  • కేంద్రం తీసుకొచ్చిన విద్యా విధానాన్ని సమర్థించిన ఖుష్బూ
  • ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని వ్యాఖ్య
  • ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానన్న సీనియర్ నటి
సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఖుష్బూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన విద్యా విధానాన్ని ఆమె సమర్థించారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని... పార్టీకి తన నిర్ణయంతో సంబంధం లేదని చెప్పారు. నూతన విద్యా విధానంపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంతో తాను విభేదిస్తున్నానని తెలిపారు. తన నిర్ణయం పట్ల రాహుల్ గాంధీ తనను క్షమించాలని కోరారు. తాను రోబోను కానని, కీలుబొమ్మను అసలే కానని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని చెప్పారు. అన్ని విషయాలకు అధిష్ఠానానికి తల ఊపాల్సిన అవసరం లేదని అన్నారు. ఒక పౌరురాలిగా మన వైఖరిని ధైర్యంగా వెల్లడించాల్సిన అవసరం ఉందని చెప్పారు.


More Telugu News