భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా.. ఆఫర్ ను తిరస్కరించిన అనుష్క!

  • వెబ్ సిరీస్ లకు పెరుగుతున్న క్రేజ్
  • ఆసక్తి చూపుతున్న పలువురు అగ్ర తారలు
  • ఓ ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆఫర్ ను తిరస్కరించిన అనుష్క
కరోనా పుణ్యమా అని ఎంటర్టైన్ మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటీటీ కారణంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీ ద్వారా విడుదలై... మంచి లాభాలను గడించాయి. మరోవైపు, వెబ్ సిరీస్ లకు క్రేజ్ అమాంతం పెరగడంతో... అగ్ర తారలు సైతం వీటికి జైకొడుతున్నారు. ఇప్పటికే పలువురు టాప్ యాక్టర్స్ వెబ్ సిరీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తాజాగా అనుష్కకు కూడా ఓ ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నుంచి భారీ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందట. పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా... ఆమె తిరస్కరించినట్టు సమాచారం. బహు భాషల్లో నిర్మితమయ్యే ఈ సిరీస్ కోసం అనుష్క అయితే సరిపోతుందని నిర్మాతలు భావించారట. కానీ, అనుష్క మాత్రం ఇంటరెస్ట్ చూపించలేదు. మరోవైపు, తాను నటించిన చిత్రం 'నిశ్శబ్దం'ను కూడా ఓటీటీలో విడుదల చేయడానికి ఆమె అయిష్టంగానే ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.


More Telugu News