ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో సోము వీర్రాజు భేటీ
- మర్యాదపూర్వకంగా వెంకయ్యనాయుడు గారిని కలుసుకున్నానన్న వీర్రాజు
- రామ్ మాధవ్ తో మంచి అనుబంధం ఉన్నట్టనిపిస్తుంటుంది
- రామ్ మాధవ్ విజన్ స్ఫూర్తిదాయకం
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత సోము వీర్రాజు తొలిసారి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తనను ప్రకటించిన తర్వాత ఉపరాష్ట్రపతి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
మరోవైపు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ ను కూడా సోము వీర్రాజు కలిశారు. ఈ భేటీకి సంబంధించి ఆయన ట్వీట్ చేస్తూ, 'రామ్ మాధవ్ ను ఎప్పుడు కలిసినా ఒక గొప్ప వ్యక్తితో నాకు మంచి అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంటుంది. దేశం, పార్టీ గురించి ఆయనకు ఉన్న విజన్ నాకు స్ఫూర్తిదాయకం' అని చెప్పారు.