జగన్ గారూ.. మీ మంత్రి అనుచరుడు కరోనా టెస్ట్ టోకెన్లు అమ్ముకుంటున్నాడు: దేవినేని ఉమ
- నిన్న ఒక్కరోజే 10,167 కరోనా కేసులు నమోదయ్యాయి
- కరోనా సెంటర్లలో పేషెంట్లను పట్టించుకోవడం లేదు
- బెడ్లు లేక ప్రాణాలు కోల్పోతున్న వారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయా?
ఏపీలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిన్న ఒక్క రోజే ఏకంగా 10,167 కేసులు నమోదయ్యాయని... 68 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సెంటర్లలో కూడా దారుణ పరిస్థితులు నెలకొన్నాయని... పేషెంట్లను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
కొడుకును ఆదుకోమని తండ్రి, తల్లికి బెడ్ ఇవ్వమని కూతురు... 5 రోజులుగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. జగన్ గారూ... మీ మంత్రి అనుచరుడు కరోనా టెస్ట్ టోకెన్లు అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. కరోనా పేషెంట్లకు అరగంటలో బెడ్ ఇస్తామని చెపుతున్న మీకు... ఆసుపత్రిలో బెడ్లు లేక ప్రాణాలు కోల్పోతున్న బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు.