అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలి: ట్రంప్

  • ఎన్నికలు నవంబర్‌ 3న నిర్వహించొద్దు
  • కరోనా విజృంభణ విపరీతంగా ఉంది
  • ప్రజలు ధైర్యంగా ఓటు వేసే వరకు వద్దు
  • మెయిల్‌-ఇన్‌ ఓటింగ్‌ చేపడితే నష్టం
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉన్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికలు నవంబర్‌ 3న నిర్వహించకుండా కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని చెప్పారు. అమెరికాలో కరోనా విజృంభణ విపరీతంగా ఉండడంతో ప్రజలు ధైర్యంగా ఓటు వేసే వరకు ఎన్నికలు వాయిదా వేయడం మంచిదని తెలిపారు.

అయితే, ఈ విషయాలేవీ పట్టించుకోకుండా మెయిల్‌-ఇన్‌ ఓటింగ్‌ చేపడితే ఈ ఎన్నికలు మోసపూరిత ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొవిడ్‌-19 సంక్షోభం నుంచి కోలుకుని ప్రజలు సరిగ్గా తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి వచ్చే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలు 1788 నుంచి క్రమం తప్పకుండా నవంబర్‌ 3నే జరుగుతున్నాయి. ఆ తేదీలను మార్చే అధికారం అమెరికా అధ్యక్షుడికి లేదు.


More Telugu News