రాఫెల్ యుద్ధ విమానాలకు సచిన్ టెండూల్కర్ స్వాగతం.. జైహింద్ అంటూ ట్వీట్

  • వీటి రాకతో మన సైనిక బలగాలకు మరింత సామర్థ్యం
  • అణ్వస్త్రాలతో దాడి చేయగల సామర్థ్యం రాఫెల్ సొంతం
  • తొలి విడతలో భాగంగా 5 విమానాల రాక
శత్రు దేశాల గుండెల్లో దడ పుట్టించే రాఫెల్ యుద్ధ విమానాల రాకను టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్వాగతించారు. మన సైన్యంలో ఇవి భాగమైనందుకు వైమానిక దళానికి అభినందనలు తెలిపిన సచిన్.. జైహింద్ అంటూ ట్వీట్ చేశాడు. విశ్రాంతి లేకుండా గగనతలం నుంచి మన దేశాన్ని కాపాడుతున్న మన సైనిక బలగాలకు మరింత సామర్థ్యం వచ్చిందని పేర్కొన్నాడు.

అణ్వస్త్రాలతో దాడి చేయగల సామర్థ్యం ఉన్న రాఫెల్ ఫైటర్ జెట్స్ కోసం 2016లో ఎన్డీయే ప్రభుత్వం ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ మొత్తం 59 వేల కోట్ల రూపాయలు. మొత్తం 36 విమానాలు రావాల్సి ఉండగా, తొలి విడతలో భాగంగా రెండు రోజుల క్రితం ఐదు విమానాలు భారత్ చేరుకున్నాయి.


More Telugu News