తాను నటుడు అవ్వాలనుకున్నప్పటి ఫొటోను పంచుకున్న సోనూ సూద్

  • 1997 నాటి ఫొటోను ట్వీట్ చేసిన సోనూ
  • స్పందించిన పూరీ జగన్నాథ్
  • సర్, నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్
ఉక్కులాంటి శరీరం ఉన్నా మనసు వెన్న... ఇది సోనూ సూద్ కు అతికినట్టు సరిపోతుంది. ఈ కండలరాయుడు తన విశాల హృదయంలో ఎంతోమందికి చోటిస్తూ, వాళ్ల కళ్లల్లో ఆనందమే తన ఆనందంగా భావిస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ఇప్పుడు సోనూ సూద్ సినీ హీరోలను మించిపోయాడు. అయితే ఒకప్పుడు తాను కూడా సినిమా అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నించినవాడ్నేనని చెబుతూ సోనూ సూద్ తన ఫొటో ఒకటి పోస్టు చేశాడు.

"1997లో నేను నటుడ్ని అవ్వాలనుకుని ధైర్యం చేసినప్పటి క్షణాలు" అంటూ ట్వీట్ చేశాడు. ఆ ఫొటోలో ఎంతో లేతగా, బక్కపలుచగా ఉన్న సోనూ సూద్ ను చూడొచ్చు. ఇక దీనిపై టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందిస్తూ, 'నిజంగానే ఇది మీరేనా సర్, నమ్మలేకపోతున్నాను' అంటూ ట్వీట్ చేశాడు. పూరీ దర్శకత్వంలో వచ్చిన 'సూపర్' సినిమాలో సోనూ సూద్ కూడా నటించిన సంగతి తెలిసిందే.



More Telugu News