మరో రెండు భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలు: వైవీ సుబ్బారెడ్డి
- ఇకపై హిందీ, కన్నడ భాషల్లోనూ ఎస్వీబీసీ
- చానల్ ను యాడ్ ఫ్రీగా మార్చుతున్నట్టు వైవీ వెల్లడి
- చానల్ మనుగడకు దాతల సహకారం తీసుకుంటామని వివరణ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవారి ఆధ్యాత్మిక వెలుగులను నలు చెరగులా పంచే ఉద్దేశంతో ఏర్పాటైన ఎస్వీబీసీ ప్రసారాలను మరింత విస్తరించనున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ప్రసారాలను ఇస్తున్న ఎస్వీబీసీ.. త్వరలో హిందీ, కన్నడ భాషల్లోనూ ప్రసారాలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది.
ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్వీబీసీని వాణిజ్య ప్రకటనల రహిత చానల్ గా మార్చుతున్నామని, చానల్ మనుగడ కోసం టీటీడీ సహకరిస్తుందని, దాతల సహకారం కూడా తీసుకుంటామని చెప్పారు. ఇక, స్వామివారి దేవస్థానంలో అర్చకులు కరోనా బారినపడడంపై స్పందిస్తూ, ఒక్కరు మినహా అర్చకులందరూ కోలుకున్నారని వెల్లడించారు. వారంతా త్వరలోనే విధుల్లో చేరతారని వివరించారు.