ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంకగాంధీ

  • ఆగస్ట్ 1లోగా బంగ్లాను ఖాళీ చేయాలన్న కేంద్రం
  • ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త ఇంటి పనులు
  • కొంత కాలం గురుగ్రామ్ లోని ఓ ఇంట్లో ఉండనున్న ప్రియాంక
ఢిల్లీ లోధీ ఎస్టేట్ లోని ప్రభుత్వ బంగ్లాను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ఖాళీ చేశారు. ఆగస్ట్ 1వ తేదీ నాటికి బంగ్లాను ఖాళీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడువులోగానే బంగ్లాను ఆమె ఖాళీ చేశారు. ఢిల్లీలో ప్రస్తుతం ఆమె కొత్త ఇంటి పనులు జరుగుతున్నాయి. ఆ ఇంట్లోకి వెళ్లేంత వరకు గురుగ్రామ్ లోని ఓ ఇంట్లో ఆమె ఉంటారని చెపుతున్నారు.

ప్రియాంకకు గత ఏడాది ఎస్పీజీ భద్రతను కేంద్రం తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ప్రియాంకకు ప్రభుత్వ బంగ్లాను కేటాయించడం కుదరదని పేర్కొంటూ... ఆగస్ట్ 1 నాటికి బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఆమెకు నోటీసులు జారీ చేసింది.


More Telugu News