ఏపీలో కరోనా ఉగ్ర రూపస్య.... మళ్లీ 10 వేలకు పైగా కేసులు!
- ఉగ్రరూపం దాల్చిన కరోనా
- ఒక్కరోజులో 68 మంది మృతి
- జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల వెల్లువ
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 10,093 కేసులు రాగా, ఆ రికార్డు ఇవాళ తెరమరుగైంది. కొత్తగా 10,167 మందికి కరోనా నిర్ధారణ అయింది. జిల్లాల్లో పాజిటివ్ కేసులు వెల్లువెత్తుతున్నాయి. తూర్పు గోదావరి, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,557కి చేరింది.
ఏపీలో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 68 మంది చనిపోయారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 1,281కి పెరిగింది. తాజాగా, 4,618 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా, 69,252 మంది ఆసుపత్రుల్లో, కొవిడ్ కేర్ సెంటర్లలో, హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.