పుట్టినరోజు సందర్భంగా కీలక ప్రకటన చేసిన సోనూ సూద్
- 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న సోనూ
- ప్రవాసీ రోజ్ గార్.కామ్ వెబ్ పోర్టల్ ఏర్పాటు
- అమెజాన్, ట్రైడెంట్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు
కరోనా వేళ కొత్త మహాత్ముడు వచ్చాడంటూ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గురించి ప్రస్తుతించడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన మానవతా దృక్పథానికి నిదర్శనాలు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా మరో స్ఫూర్తిదాయక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే ఉద్యోగాల కల్పన కోసం 'ప్రవాసీరోజ్ గార్.కామ్' అనే వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసిన సోనూ ట్విట్టర్ లో స్పందించారు.
ఈ పోర్టల్ సాయంతో నిరుద్యోగులను ఆదుకోవాలని నిశ్చయించామని, తాము కల్పించే ఉద్యోగాలకు పీఎఫ్, ఈఎస్ఐ, తదితర సౌకర్యాలు కూడా అందుతాయని వివరించారు. అమెజాన్, సోడెక్సో, అర్బన్ కో, పోర్టీ, క్వెస్ కార్ప్, ఏఈపీసీ, సీఐటీఐ, ట్రైడెంట్ వంటి సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తన కార్యాచరణలో పాలుపంచుకుంటున్నందుకు ఆయా సంస్థలకు సోనూ కృతజ్ఞతలు తెలిపారు.