సున్నా వడ్డీని లక్ష లోపు రుణాలకు పరిమితం చేయడం మోసం కాదా సీఎం గారూ!: దేవినేని ఉమ

  • తాము రూ.3 లక్షల వరకు సున్నావడ్డీ అమలు చేశామన్న ఉమ
  • వడ్డీలేని పంట రుణాలు ఇస్తామని దగా చేశారని విమర్శలు
  • రైతుల ఖాతాల్లో ఎంత జమచేశారో చెప్పాలన్న టీడీపీ నేత
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో సున్నా వడ్డీని రూ.3 లక్షల పంట రుణాలకు కూడా అమలు చేశామని, కానీ ఇప్పుడు అదే సున్నా వడ్డీని లక్ష లోపు పంట రుణానికి పరిమితం చేశారని మండిపడ్డారు. ఇది రైతులను దగా చేయడం కాదా ముఖ్యమంత్రి గారూ అంటూ జగన్ ను నిలదీశారు.

 "ఎన్నికల ముందు రైతులకు వడ్డీలేని పంట రుణాలు ఇస్తామని చెప్పారు. గత ఏడాది తీసుకున్న రూ.76 వేల కోట్ల పంట రుణాలకు రైతుల ఖాతాల్లో ఎంత జమ చేశారు?" అంటూ ప్రశ్నించారు. సున్నా వడ్డీ కిరికిరి... రైతులకు లక్ష వరకే రాయితీ, అంతకుమించి రుణం తీసుకుంటే వడ్డీ బాదుడే అంటూ మీడియాలో వచ్చిన ఓ కథనం తాలూకు క్లిప్పింగ్ ను కూడా ఉమ పంచుకున్నారు.


More Telugu News