కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన న్యాయస్థానం

  • కొల్లు రవీంద్రకు కోర్టులో చుక్కెదురు
  • మోకా భాస్కరరావు హత్యకేసులో నిందితుడిగా కొల్లు రవీంద్ర
  • బయటికి వస్తే కేసును ప్రభావితం చేస్తారన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్
  • ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన కోర్టు
మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఏ-4 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బెయిల్ కోరుతూ కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కొల్లు రవీంద్ర బయటికి వస్తే ఈ కేసుకు సంబంధించిన అంశాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను కోర్టు సమర్థించింది. కొల్లు రవీంద్ర ఈ హత్య కేసులో కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్నారు. అంతకుముందు, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ సైతం ఏపీ హైకోర్టులో తిరస్కరణకు గురైంది. ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది.


More Telugu News